India: పలు రాష్ట్రాలలో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

  • ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.1.67 పెంపు
  • డీజిల్ ధర ఒక్కసారిగా రూ.7.10 పెరుగుదల
  • హైదరాబాద్, అమరావతిలో మారని ధరలు
  • హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.73.97 అమరావతిలో రూ.74.61  
petrol rates in india

ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచిన నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.1.67, డీజిల్ ధర ఒక్కసారిగా రూ.7.10 పెరిగింది. దీంతో ఢిల్లీలో నిన్నటివరకు రూ. 69.59గా ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.71.26గా ఉంది. నిన్నటి వరకు డీజిల్ ధర రూ .62.29గా ఉండగా, ఇప్పుడు రూ.69.29కు చేరింది.

మరోవైపు, ముంబైలో పెట్రోల్‌ లీటరు ధర రూ.76.31, డీజిల్ ధర రూ. 66.21గా ఉన్నాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.73.30, డీజిల్ ధర రూ. 65.62 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.3.26 పెరగడంతో లీటరు పెట్రోలు ధర రూ. 75.54,  డీజిల్ ధర రూ.68.22గా ఉంది.

ఇక హర్యానా, నాగాలాండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్, అమరావతిలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పుల్లేవు. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.73.97, లీటరు డీజిల్ ధర రూ. 67.82గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర లీటరు రూ.74.61 ఉండగా, డీజిల్ ధర  రూ. 68.52గా ఉంది.

More Telugu News