Flipkart: ఫ్లిప్ కార్ట్ కు సీఎఫ్ఓ రాజీనామా!

  • 2018 నుంచి సీఎఫ్ఓగా ఉన్న మెక్ నీల్
  • మెరుగైన అవకాశాల కోసం తిరిగి స్వదేశానికి
  • కొత్త సీఎఫ్ఓగా శ్రీరామ్ వెంకటరమణ నియామకం
CFO Mc Neel Resigns form Flipkart

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం, వాల్ మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్ కార్ట్ లో 2018 నుంచి గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా విధుల్లో ఉన్న ఎమిలీ మెక్ నీల్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని నిర్ధారించిన సంస్థ, కొత్త సీఎఫ్ఓగా శ్రీరామ్ వెంకటరమణను నియమించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై శ్రీరామ్, వాల్ మార్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓ క్రిస్ నికోలస్ కు రిపోర్ట్ చేస్తారని పేర్కొంది.

ఫ్లిప్ కార్ట్, మింత్రాలకు సంబంధించిన పన్ను చెల్లింపు వ్యవహారాలు, రిస్క్ మేనేజ్ మెంట్, ట్రెజరీ తదితర కార్యకలాపాలను నిర్వహిస్తారని సంస్థ పేర్కొంది. కాగా, వాల్ మార్ట్ వెలుపల మెరుగైన కెరీర్ అవకాశాల కోసం తాను తిరిగి యూఎస్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఎమిలీ మెక్ నీల్ తన రాజీనామా లేఖలో వెల్లడించినట్టు పేర్కొన్న ఫ్లిప్ కార్ట్, ఆమె సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కితాబునిచ్చింది.

More Telugu News