Chennai: చెన్నైలో ఇళ్ల ముందు నోట్ల కలకలం.. కరోనా వైరస్ వ్యాప్తికి కుట్రా?

  • సైకిల్‌పై వచ్చి నోట్లు వెదజల్లి పోతున్న గుర్తుతెలియని వ్యక్తులు
  • కరోనా భయంతో నోట్లను ముట్టని జనం
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
Currency notes in front of houses Chennai people shoking

చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తుండడం కలకలం రేగుతోంది. నోట్ల మాటున కరోనా వ్యాప్తికి కుట్ర జరుగుతోందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  చెన్నైలోని పురసైవాక్కం, వెస్ట్‌ మాంబళం, మాధవరం తదితర ప్రాంతాల్లోని ఇళ్ల ముందు రాత్రివేళ నోట్లు దర్శనమిస్తున్నాయి. ఈ నెల 2 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు  కొందరు  చెన్నై మాధవరం పాలకొట్టం సమీపంలోని కేకే తాళై మాణిక్యం వీధిలో ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 కరెన్సీ నోట్లను చల్లి వెళ్లిపోయారు. గమనించిన కొందరు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా చిక్కలేదు.

నోట్లు చల్లిన వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో వాటిని తీసుకునేందుకు జనం భయపడ్డారు.  నోట్లను వీడియో తీసిన ఓ మహిళ ఇలాంటివి ఇళ్ల ముందు కనిపిస్తే తీసుకోవద్దని, కరోనా సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు.

More Telugu News