New Delhi: మందుబాబులకు కేజ్రీవాల్ షాక్... 'కరోనా ఫీజ్' పేరిట 70 శాతం అదనపు బాదుడు!

  • రూ. 1,000 ఎంఆర్పీ బాటిల్ ఖరీదు రూ. 1,700
  • స్పెషల్ కరోనా ఫీజ్ పేరిట అదనపు పన్ను
  • నేటి నుంచి అమలులోకి కొత్త ధరలు
70 Percent Special Corona Tax on Liquor in Delhi

కేంద్ర ఆదేశాల మేరకు ఢిల్లీలో మద్యం దుకాణాలను తెరిపించిన కేజ్రీవాల్ సర్కారు, మందుబాబులపై 'ప్రత్యేక కరోనా ఫీజు' పేరిట పెద్ద బండనే వేసింది. అన్ని రకాల మద్యం అమ్మకాలపై 70 శాతం కొత్త పన్నును విధించింది. దీని ప్రకారం, మద్యం బాటిల్ ఎంఆర్పీపై 70 శాతం అదనంగా వసూలు చేస్తారు. అంటే, రూ. 1000 ఉన్న బాటిల్ ఖరీదు ఇకపై రూ. 1,700 అవుతుంది. కొత్త ధరలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవాలంటే, లిక్కర్ అమ్మకాలే శ్రేయస్కరమని భావించిన ప్రభుత్వం, ఈ మేరకు ధరలను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతినగా, పన్ను వసూళ్లు సైతం మందగించిన నేపథ్యంలో నిన్న సమావేశమైన కేజ్రీవాల్ క్యాబినెట్ 70 శాతం సుంకాలు విధిస్తూ, నిర్ణయం తీసుకుంది.

More Telugu News