Utrech University: కరోనాపై పోరులో కీలక ముందడుగు... వైరస్ ను నిలువరించే యాంటీ బాడీ గుర్తింపు!

Scientists Research on Antibodies
షార్ట్స్‌లో చూడండి
కరోనా సూక్ష్మ క్రిమిని శరీరంలో వ్యాపించనీయకుండా చేసే యాంటీ బాడీలను గుర్తించామని ఉట్రేచ్ యూనివర్శిటీ పరిశోధకులు ప్రకటించారు. 'నేచర్ కమ్యూనికేషన్స్' ఆన్ లైన్ మేగజైన్ ఈ వివరాలను వెల్లడించింది.

వర్శిటీ పరిధిలోని హెచ్ఎంబీ (ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హార్బర్ బయోమెట్) ఓ ప్రకటన విడుదల చేస్తూ, కరోనా చికిత్సలో ఇదో మైలురాయని అభివర్ణించింది. ఈ యాంటీ బాడీ, సార్స్ కోవ్-2లో ఓ కణాన్ని పట్టుకుని, దాని వ్యాప్తిని అడ్డుకుంటుందని రీసెర్చ్ కి నేతృత్వం వహించిన డాక్టర్ బాష్ వెల్లడించారు.

ఈ యాంటీ బాడీకి క్రాస్ న్యూట్రలైజింగ్ గుణాలుండటం తమకు ఆసక్తిని కలిగించిందని, కరోనా వైరస్ ను నిలువరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ఈ ప్రయోగాల్లో సార్స్ కోవ్ 1 యాంటీ బాడీలను వినియోగించామని తెలిపారు. ఈ పరిశోధనలపై స్పందించిన హెచ్బీఎం చైర్మన్ డాక్టర్ జింగ్ సాంగ్ వాంగ్, ప్రస్తుతం ఈ యాంటీ బాడీలు మానవ శరీరంలో వైరస్ ను ఏ మేరకు అడ్డుకుంటాయన్న అంశంపై మరిన్ని ప్రయోగాలు చేయాలని సంకల్పించామని, భాగస్వామ్య రీసెర్చర్లతో కలిసి ముందడుగు వేస్తామని తెలిపారు.
Go Back to Shorts
Utrech University
Anti Body
Corona

More Telugu News