Lavanya Tripathi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Lavanya shows interest in web series
  • రూటు మార్చనున్న లావణ్య 
  • విజయ్ చిత్రానికి తమన్ మ్యూజిక్
  • నారా రోహిత్ భారీ బడ్జెట్ చిత్రం  
 *  కథానాయిక లావణ్య త్రిపాఠి కూడా త్వరలో డిజిటల్ ప్రపంచంలోకి వచ్చేలా కనిపిస్తోంది. 'వెబ్ సీరీస్ అంటే నాకు కూడా ఇష్టమే. ఏదో ఒకరోజున నన్ను కూడా మీరు వెబ్ సీరీస్ లో చూస్తారు' అని చెప్పింది లావణ్య. అన్నట్టు, ఈ చిన్నది ప్రస్తుతం 'ఏ 1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' చిత్రాలలో నటిస్తోంది.
*  ప్రస్తుతం తెలుగులో సక్సెస్ ఫుల్ బిజీ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న తమన్ త్వరలో తమిళ హీరో విజయ్ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని సమకూర్చనున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందే చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను తీసుకున్నట్టు తాజా సమాచారం.
*  గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా వున్న హీరో నారా రోహిత్ త్వరలో ఓ చిత్రంలో నటించనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇది భారీ బడ్జెట్టుతో రూపొందే చిత్రమనీ, దీనిని రోహిత్ సొంతంగా నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో అతని లుక్ కూడా సరికొత్తగా ఉంటుందని అంటున్నారు.  
Lavanya Tripathi
Thaman
Vijay
Murugadas
Nara Rohith

More Telugu News