CRPF: కుప్వారా జిల్లాలో ఇవాళ మరో ముగ్గురు భద్రతా సిబ్బంది బలి... మిలిటెంట్ల ఘాతుకం

Terrorists attacks on Naka Party at Kralgund as three CRPF Jawans killed
  • నిన్న హంద్వారాలో ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి
  • రహదారి భద్రతా విధుల్లో ఉన్న జవాన్లపై తాజాగా దాడి
  • క్రాల్ గుంద్ ప్రాంతంలో ఘటన
జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. నిన్న హంద్వారాలో ఐదుగురు భద్రతా సిబ్బంది మృతికి కారణమైన ఉగ్రవాదులు ఇవాళ క్రాల్ గుంద్ ప్రాంతంలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్నారు. రహదారిపై భద్రతా విధులు నిర్వర్తిస్తున్న జవాన్లపై మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
CRPF
Jawans
Kupwara
Jammu And Kashmir
Handwara

More Telugu News