Jagan: 'ఎంఫాన్' తుపాను వస్తోంది... జాగ్రత్తగా ఉండండి: జగన్

  • తుపాను మన రాష్ట్రంవైపు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
  • తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి
  • చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దు
Be cautious about Emphan cyclone says Jagan

ఎంఫాన్ తుపాను విషయంలో జాగ్రత్తగా ఉండాలని... తుపాను మన రాష్ట్రం వైపు వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

రెవెన్యూ, వైద్యశాఖ, విద్యుత్తు, పౌరసరఫరాల అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. తుపాను వస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సముద్రంలో చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. తుపాను వస్తే ఏం చేయాలనే దానిపై అధికారులు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

తుపానును దృష్టిలో ఉంచుకుని రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంటలో మూడింట ఒక వంతును ప్రభుత్వమే కొనుగోలు చేస్తే... ధరల స్థిరీకరణ జరుగుతుందని చెప్పారు. పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, మార్కెట్ ను ఏర్పాటు చేసుకుని అక్కడకు పంపాలని తెలిపారు.

  • Loading...

More Telugu News