Centre: వలస కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేయాలని ఎప్పుడూ చెప్పలేదు: కేంద్రం

  • రైళ్ల ద్వారా వలస కార్మికుల తరలింపు
  • చార్జీలు వసూలు చేస్తున్నారన్న సోనియా
  • సోనియా వ్యాఖ్యలను కొట్టిపారేసిన కేంద్రం
Centre says there no charges for migrants

లాక్ డౌన్ కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బేదో తామే కడతామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై కేంద్రం స్పందించింది. వలస కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేయాలని రాష్ట్రాలకు తామెప్పుడూ చెప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది.

 దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, రాష్ట్రాల అభ్యర్థనలపై రైళ్లు నడిపేందుకు అనుమతి జారీ చేశామని, చార్జీల విషయాన్ని 85:15 నిష్పత్తిలో రైల్వే, రాష్ట్రాలు భరించేట్టు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అంతేతప్ప వలస కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేయమని రాష్ట్రాలను కోరలేదని అన్నారు.

More Telugu News