Nagababu: చూస్తుంటే మందుబాబులే కరోనాను వ్యాపింపచేసేలా ఉన్నారు: నాగబాబు

Nagababu questions Central Government decision of liquor shops opening
  • మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • ఇదో పెద్ద తప్పిదం అని పేర్కొన్న నాగబాబు
  • ఇంత అర్జెంటుగా మందు షాపులు తెరవడం సరికాదని వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలకు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇంత అర్జెంటుగా మద్యం షాపులు తెరవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదో పెద్ద తప్పిదంలా అనిపిస్తోందని, ప్రజలు కూడా మందు విషయంలో విచక్షణ కోల్పోతున్నారని ట్వీట్ చేశారు. చూస్తుంటే, మందుబాబులే కరోనా వైరస్ ను వ్యాపింపచేసేలా ఉన్నారని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని పేర్కొన్నారు.
Nagababu
Liquor Shops
Lockdown
Corona Virus

More Telugu News