Jagan: అధికారులతో సీఎం జగన్ సమీక్ష.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారి గురించి ఆరా!

  • ‘కరోనా’ నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష
  • రాష్ట్రానికి వచ్చే వాళ్ల వివరాలు సేకరిస్తున్నాం
  • వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతిస్తాం
  • వ్యక్తిగతంగా వచ్చే వారికి ఎటువంటి అనుమతి లేదు
AP CM Jagan review on covid 19

ఏపీలో కరోనా వైరస్ నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. వలసకూలీలు, యాత్రికులు, విద్యార్థుల అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి వచ్చే వాళ్లు ఎక్కడ నుంచి వస్తున్నారు? ఆయా రాష్ట్రాల్లో వారు గ్రీన్ జోన్లలో ఉన్నారా? ఆరెంజ్ జోన్లలో ఉన్నారా? లేక రెడ్ జోన్లలో ఉన్నారా? అనే వివరాలు సేకరిస్తున్నామని జగన్ కు అధికారులు తెలిపారు.

ఈ విషయాలన్నింటిని నిర్ధారించుకున్న తర్వాతే వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. వ్యక్తిగతంగా వచ్చే వారికి ఎటువంటి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి చేయాల్సిన పరీక్షలపై మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

More Telugu News