Andhra Pradesh: ఏపీ సహా దేశంలో మద్యం దుకాణాల ముందు తీవ్ర ఉద్రిక్తతలు.. కిలో మీటరు మేర క్యూ.. వీడియో, ఫొటోలు ఇవిగో!

  • ఏపీలో అప్‌డేట్‌ కాని మద్యం ధరలు
  • కొన్ని ప్రాంతాల్లో తెరచుకోని మద్యం షాపులు
  • గంటల కొద్దీ క్యూలైన్లలో మందు ప్రియులు
  • తలలు పట్టుకుంటోన్న పోలీసులు
  • కొన్ని ప్రాంతాల్లో మందుబాబులను చెదరగొట్టిన పోలీసులు
ruckus in india as wine shops open

దేశంలోని గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు మందుబాబులు గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మందు షాపుల ముందు ఉద్రిక్తత నెలకొంది. పెరిగిన మద్యం ధరల వివరాలు సీసాలపై అప్‌డేట్‌ కావపోవడంతో మందుబాబులకు మందు అందడంలో ఆలస్యం జరుగుతోంది.
                                                       
ఉదయం నుంచే దుకాణాల ముందు క్యూ కట్టిన మందుబాబుల్లో ఓపిక నశిస్తోంది. వరుసలో నిలబడాలని పోలీసులు ఎంతగా చెబుతున్నా వారు వినిపించుకోవట్లేదు. మాస్కులు ధరించడం లేదు, భౌతిక దూరం పాటించట్లేదు. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు బారులు తీరిన వందలాంది మందిని పోలీసులు చెదరగొట్టారు.
                                             
         
అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. విజయనగరంలో ఉదయం నుంచి మద్యం దుకాణాల వద్దే మందుబాబులు వేచి చూస్తున్నారు. మద్యం షాపులు తెరుచుకోకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు.

పాత ధరలను కొత్త ధరలకు మార్చటంలో సాంకేతిక లోపం తలెత్తిందని విజయనగరంలోని పలు షాపుల యజమానులు మీడియాకు చెప్పారు. దీంతో మద్యం షాపులు ఇంకా తెరవలేదని తెలిపారు. విశాఖపట్నంలో మద్యం దుకాణాల ముందు విపరీతంగా రద్దీ ఉంది.                                   
కాగా, ఈ రోజు ఉదయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మందుబాబులు వందలాది మంది మద్యం దుకాణాలకు చేరుకోవడంతో వారిని అదుపు చేయలేక, మద్యం దుకాణాల సిబ్బంది, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.                                                       
క్యూ లైన్లలో నిలబడిన వారు ఒకరిని ఒకరు తాకుతూ, మద్యం కోసం ఎగబడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గాన్‌లోని మద్యం షాపులకు వేలాదిమంది తరలివచ్చారు. ఢిల్లీలోని బురారీలో ఓ మద్యం దుకాణం ఎదుట కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

More Telugu News