YSRCP: నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత హల్‌చల్
- తనపై దాడి చేశారని ఇటీవల ఫిర్యాదు
- చర్యలు తీసుకోవట్లేదని ఆందోళన
- అర్ధ నగ్నంగా పీఎస్ ముందే నిరసన
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేత కాటమరాజు హల్‌చల్ చేశారు. తనపై దాడిచేసిన వారిపై తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. నల్లపాడు పోలీసు స్టేషన్ ఆవరణలో ఆయన అర్ధనగ్నంగా నిరసనకు దిగారు. ఆయనకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన వినడం లేదు.
కాగా, గుంటూరులో ఓ పనిపై బయటకు వెళ్లిన తనపై కొందరు దాడి చేశారని కాటమరాజు ఇటీవల ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఇప్పటికీ ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆందోళనకు దిగారు.