Devineni Uma: లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న వైసీపీ నేత‌ల‌పై కేసులు ఎందుకు పెట్ట‌రు?: దేవినేని ఉమ

Devinineni Uma Statement
  • పేదలకు నిత్యావసరాల పంపిణీ చేసిన కేశినేనిపై అక్రమ కేసు పెడతారా?
  • టీడీపీ నేత‌ల‌పైనా అక్రమకేసులు పెడుతున్నారు
  • స‌ర్కారు క‌క్ష‌పూరిత వైఖ‌రి తగదు
విజయవాడలోని 47వ డివిజన్ లో కూరగాయలు పంపిణీ సమయంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు.

సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘కరోనా‘ క్లిష్ట సమయాల్లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన తమ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేత‌ల‌పై అక్రమకేసులు న‌మోదు చేయ‌డం స‌ర్కారు క‌క్ష‌పూరిత వైఖ‌రిని వెల్ల‌డిస్తోందని మండిపడ్డారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న వీసారెడ్డి, వైసీపీ నేత‌ల‌పై కేసులు ఎందుకు పెట్ట‌రో సమాధానం చెప్పాలని జగన్ ని ఉమ డిమాండ్ చేశారు.
Devineni Uma
Telugudesam
Jagan
Vijay Sai Reddy
YSRCP

More Telugu News