Marriage: హైదరాబాద్ నుంచి ముంబయికి లక్ష అడుగుతున్నారట... చిక్కుకుపోయిన పెళ్లివారి ఆవేదన!

  • మార్చి రెండో వారంలో హైదరాబాద్ కు వచ్చిన పెళ్లి బృందం
  • రైళ్లు రద్దు కావడంతో ఇక్కడే ఉండిపోయిన పలువురు
  • ప్రభుత్వం కల్పించుకుని పంపాలని వినతి
Mumbai Residents Stuck up in Hyderabad

హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లేందుకు లక్ష రూపాయలు అడుగుతున్నారని, అంత చెల్లించే స్తోమత తమకు లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు కొందరు. వివరాల్లోకి వెళితే, వారంతా ఓ పెళ్లి వేడుక నిమిత్తం ముంబయి నుంచి హైదరాబాద్ కు మార్చి రెండో వారంలో వచ్చారు.

ముంబయికి చెందిన శంకర్ కట్టల్, దీపమ్మల కుమార్తె పుష్పకు, పార్శీగుట్టకు చెందిన శ్రీనివాస్ తో వివాహం నిశ్చయమైంది. 19వ తేదీన వివాహం వైభవంగా జరిగింది కూడా. ఆపై 23న తిరిగి ముంబయికి వెళ్లేందుకు టికెట్లను కూడా బుక్ చేసుకున్నారు. ఈలోగా లాక్ డౌన్ అమలులోకి రావడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. వీరంతా తమను ఎలాగైనా స్వస్థలానికి చేర్చాలని ఇప్పుడు వాపోతున్నారు.

తామంతా లాక్ డౌన్ ప్రారంభం కాగానే, ముషీరాబాద్ ప్రాంతంలో రెండు గదుల ఇంటిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటున్నామని, ప్రభుత్వం నుంచి నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ తో పాటు, లక్ష రూపాయలు ఇస్తే, అందరినీ ముంబయి చేరుస్తామని ఓ ప్రైవేటు ట్రావెల్స్ చెప్పిందని వారు వెల్లడించారు. లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో, తమను తిరిగి వెనక్కు పంపించాలని కోరుతున్నారు. 

More Telugu News