Petrol: దిగివచ్చిన విమాన ఇంధనం ధర... లీటర్ రూ. 22.54 మాత్రమే!

  • 23 శాతం తగ్గిస్తూ చమురు సంస్థల నిర్ణయం
  • రూ. 22.54కు లీటర్ ఏటీఎఫ్
  • పెట్రోలు ధర మాత్రం రూ. 69.59 వద్ద
ATF Price Below Petrol Price

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరల తగ్గుదలతో ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌/ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ధరలు భారీగా తగ్గాయి. ఏటీఎఫ్ ధర ఏకంగా 23 శాతం తగ్గింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే, ఏటీఎఫ్ ధర తక్కువకు దిగిరావడం గమనార్హం. ఇక, తాజా తగ్గింపు తరువాత న్యూఢిల్లీలో ఏటీఎఫ్‌ ధర కిలోలీటర్‌ (అంటే వెయ్యి లీటర్లు) రూ.6,813  తగ్గి, రూ. 22,545కు చేరింది. దీని ప్రకారం, లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 22.54 మాత్రమే. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోలు ధర రూ. 69.59, డీజిల్‌ ధర రూ. 62.29గా ఉంది. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏటీఎఫ్‌ ధర మూడింట రెండు వంతుల మేరకు తగ్గడం విశేషం.

  • Loading...

More Telugu News