కిమ్ భేషుగ్గానే ఉన్నారు.. శస్త్రచికిత్స వార్తలు అవాస్తవం: దక్షిణ కొరియా

  • గత కొన్ని రోజులుగా కిమ్ ఆరోగ్యంపై వార్తలు
  • ఇటీవల బహిరంగంగా కనిపించి ఊహాగానాలకు తెరదించిన కిమ్
  • ఆయన క్షేమంగా ఉన్నట్టు సమాచారం ఉందన్న సౌత్ కొరియా
Kim Jong Un Health Condition is well says South Korea

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు శస్త్రచికిత్స జరిగిందని, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించిందన్న వార్తలు ఇటీవల హల్‌చల్ చేశాయి. తాజాగా, కిమ్ ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.

దీంతో ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడుతుందని భావించినా అలా జరగలేదు సరికదా, ఆయన ఆరోగ్యంపై మరిన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. కిమ్‌కు శస్త్రచికిత్స కానీ, మరేదైనా చికిత్స కానీ జరిగి ఉంటుందని వార్తలు వస్తూనే వున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు తమకు సమాచారం అందిందని దాయాది దేశం దక్షిణ కొరియా అధికారి ఒకరు పేర్కొన్నారు.

More Telugu News