India: 24 గంటల్లో 2,487 కేసులు నమోదు... దేశంలో ఒక్కరోజులో గరిష్ట పెరుగుదల ఇదే!

India registers more cases as corona outbreak continues
  • 40 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
  • ఇవాళ 83 మంది మృతి
  • మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా బీభత్సం
భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటివరకు లేని విధంగా ఒక్కరోజులోనే గరిష్ట కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,487 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. దాంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,263కి పెరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా 83 మరణాలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకు ఈ వైరస్ భూతానికి బలైన వారి సంఖ్య 1306గా నమోదైంది. ఇవాళ 869 మంది డిశ్చార్జి కాగా, 28,070 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక, రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్రలో అత్యధికంగా 12,296 కేసులు నమోదయ్యాయి. 521 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్ లో 5,055 మందికి కరోనా సోకగా, 262 మంది మరణించారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఓ మోస్తరు అదుపులో ఉన్నట్టే భావించాలి. ఏపీలో 58 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 6 కేసులు వెల్లడయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వెయ్యికిపై కేసులు నమోదయ్యాయి.
India
Corona Virus
Positive Cases
Deaths

More Telugu News