MeeSeva: తెలంగాణ మీసేవ ఆపరేటర్లకు గుడ్ న్యూస్

Good news to Telangana MeeSeva operators
  • రూ. 5 వేల రెన్యువల్ ఫీజు రద్దు
  • రూ. 12 వేల వడ్డీ లేని రుణాలు
  • కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన సంఘం నేతలు
మీసేవ ఆపరేటర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ. 5 వేల రెన్యువల్ ఫీజును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు మీసేవ సెంటర్ నిర్వాహకులకు రూ. 12 వేల వరకు వడ్డీ లేని రుణాన్ని అందించనున్నట్టు తెలిపింది. ఈ మొత్తాన్ని ఆపరేటర్ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ రుణాన్ని నెలకు రూ. 1000 వంతున వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 5,300 మంది ఆపరేటర్లు లబ్ధి పొందనున్నారు.

ప్రభుత్వ నిర్ణయం పట్ల మీసేవ ఆపరేటర్ల సంఘం నేతలు, టీఎంఓయూ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
MeeSeva
Telangana
Renual Fees

More Telugu News