Narendra Modi: వ్యవసాయ రంగం, ఎగుమతులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం: మోదీ

  • వ్యవసాయరంగంపై ప్రధాని సమావేశం
  • అగ్రికల్చర్ మార్కెటింగ్ పై చర్చించామన్న మోదీ
  • బ్రాండ్ ఇండియా కోసం కృషి చేస్తున్నామని వెల్లడి
PM Modi conducts meeting on Agriculture sector

కరోనా కల్లోల సమయంలో ఏకైక ఆశాకిరణంలా కనిపిస్తున్నది వ్యవసాయరంగమేనంటూ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఓసారి వ్యాఖ్యానించారు. తాజాగా, వ్యవసాయరంగానికి మరింత ఊతమిచ్చేందుకు అవసరమైన చర్యలపై సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగ సంస్కరణలకు సంబంధించిన అన్ని కోణాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించామని, అగ్రికల్చర్ మార్కెటింగ్, విక్రయించదగిన మిగులు ఉత్పత్తుల నిర్వహణ, రైతులకు సంస్థాగత రుణ సదుపాయం, వివిధరకాల ఆంక్షల నుంచి వ్యవసాయ రంగవిముక్తి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని మోదీ పేర్కొన్నారు.  

కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్, ఈ-నామ్ వంటి పథకాలు రైతులకు మరింత ఉపయోగపడేందుకు అవసరమైన చర్యలపైనా అభిప్రాయాలు స్వీకరించామని ట్విట్టర్ లో వెల్లడించారు. ఫల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఆర్డర్ల పెంపుదలపైనా ప్రభుత్వం కృషి చేస్తోందని, వ్యవసాయ ఎగుమతులకు మరింత ఊతమిచ్చేలా సదరు రంగంలో 'బ్రాండ్ ఇండియా' కోసం పరిశ్రమిస్తున్నామని తెలిపారు.

More Telugu News