Varla Ramaiah: గ్రీన్ జోన్ లో మద్యం అమ్మితే ఆ ప్రభావం రెడ్ జోన్ పై పడుతుంది: వర్ల రామయ్య

Varla Ramaiah says government should not sell liquor in green zones
  • గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • మద్యం విక్రయాలు సరికాదన్న వర్ల
  • తప్పకుండా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందంటూ ట్వీట్
టీడీపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య లాక్ డౌన్ పరిస్థితులు, సడలింపుల అంశంపై స్పందించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల మద్యం అమ్మకాలకు అనుమతి సరికాదని సీఎం జగన్ కు హితవు పలికారు. గ్రీన్ జోన్ లో మద్యం విక్రయిస్తే, ఆ మద్యం తాగిన మందుబాబుల ప్రభావం రెడ్ జోన్లపై పడుతుందని వర్ల రామయ్య వివరించారు.

ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందని, అప్పుడు కరోనాను కట్టడి చేయడం శక్తికి మించిన పనవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్యం దృష్ట్యా మద్యం విక్రయాలు నిలిపివేయాలని సూచించారు. కాగా, లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ, కొన్ని నిబంధనలకు లోబడి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే.
Varla Ramaiah
Andhra Pradesh
Liquor
Green Zones
Lockdown
Corona Virus

More Telugu News