Amitabh Bachchan: రిషి కపూర్ ను చూడటానికి వెళ్లకపోవడానికి కారణం ఇదే: అమితాబ్ బచ్చన్

This is the reason for not seeing Rishi Kapoor in hospital says Amitabh
  • చిరునవ్వుతో ఉండే రిషి ముఖంలో బాధను చూడాలనుకోలేదు
  • చివరి క్షణం వరకు ఆయన ముఖంపై చిరునవ్వు ఉండే ఉంటుంది
  • చిరునవ్వుతోనే తుదిశ్వాస విడిచి ఉంటారు
బాలీవుడ్ సోగ్గాడు రిషికపూర్ మృతి పట్ల సినీ ప్రముఖులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ వేదనను అనుభవిస్తున్నారు. బిగ్ బీ కూడా ఆవేదనను, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

రిషి ఆసుపత్రిలో ఉన్నప్పుడు చూడటానికి తాను వెళ్లలేదని అమితాబ్ చెప్పారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే రిషి ముఖంలో బాధను చూడాలనుకోలేదని అన్నారు. అందుకే ఆయనను చూసేందుకు వెళ్లలేదని చెప్పారు. చివరి క్షణం వరకు రిషి ముఖంపై చిరునవ్వు ఉండే ఉంటుందని... చిరునవ్వుతోనే ఆయన తుదిశ్వాస విడిచి ఉంటారని అన్నారు. రిషి నవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు.
Amitabh Bachchan
Rishi Kapoor
Bollywood

More Telugu News