CRPF: ఢిల్లీలో 122 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా.. నిర్బంధంలో బెటాలియన్!

  • బాధితులంతా 31వ బెటాలియన్ కు చెందినవారు
  • మరో 100 మంది ఫలితాల కోసం నిరీక్షణ
  • బాధితులకు మండోలిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
122 CRPF Jawans tests corona positive

ఢిల్లీలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా 122 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఈ వైరస్ సోకింది. వీరంతా 31వ బెటాలియన్ కు చెందినవారు. మరో 100 మందికి సంబంధించిన వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే, పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మందికి అసలు కరోనా లక్షణాలే లేవని చెప్పారు. కరోనా బారిన పడిన వారిని మండోలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తొలుత ఈ వారం ప్రారంభంలో 55 ఏళ్ల వయసున్న ఓ ఎస్ఐ కరోనా కారణంగా చనిపోయారు. సెలవులపై ఊరికి వెళ్లొచ్చిన ఓ కానిస్టేబుల్ వల్లే బెటాలియన్ లోని ఇతరులకు వైరస్ సోకిందని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో బెటాలియన్ ప్రాంతాన్ని నిర్బంధంలో ఉంచారు.

More Telugu News