Prabhas: సినీ హీరో ప్రభాస్ స్థలంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!

  • రాయదుర్గంలోని 2,083 చ.గ. భూమిపై పిటిషన్
  • గతంలో తామిచ్చిన ఆదేశాలను పాటించాలన్న హైకోర్టు
  • సివిల్ కోర్టులో పిటిషనర్ న్యాయపోరాటం చేయవచ్చని సూచన
High Court orders status quo in Prabhas land case

హైదరాబాద్ రాయదుర్గంలో సినీ నటుడు ప్రభాస్ కు చెందిన 2,083 చదరపు గజాల భూమిపై స్టేటస్ కో పాటించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది ఏప్రిల్ 23న తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది.

అప్పుడు ఇచ్చిన ఆదేశాలను విచారణ సందర్భంగా హైకోర్టు చదివి వినిపించింది. సీజ్ చేసిన ఈ భూమిలోని నిర్మాణాలను కూల్చి వేయవద్దని తెలిపింది. ఆస్తిని పిటిషనర్ కు స్వాధీనపరచాల్సిన అవసరం లేదని... రెవెన్యూ డిపార్ట్ మెంట్ స్వాధీనంలోనే ఉంచాలని చెప్పింది. యాజమాన్య హక్కుల కోసం సివిల్ కోర్టులో పిటిషనర్ న్యాయపోరాటం చేయవచ్చని తెలిపింది.

గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగానే... రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి ప్రభాస్ ఇంజంక్షన్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. తన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో... రెవెన్యూ అధికారులు మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

More Telugu News