Lavanya Tripathi: అప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నాను: లావణ్య త్రిపాఠి

Unnadi Okate Zindagi Movie
  • విభిన్నమైన పాత్రలనే చేస్తున్నాను
  • మేకప్ కుదరలేదంటూ విమర్శలు వచ్చాయి
  • తమిళంలో చేస్తున్నానన్న లావణ్య త్రిపాఠి
నటన పరంగా .. గ్లామర్ పరంగా లావణ్య త్రిపాఠికి మంచి పేరు వుంది. ఒక్కో సినిమాను ఒప్పుకుంటూ, తనని తాను నిరూపించుకుంటూ వెళుతోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ, తనపై వచ్చిన విమర్శలను గురించి ప్రస్తావించింది.

"మొదటి నుంచి కూడా విభిన్నమైన పాత్రలనే చేస్తూ వెళుతున్నాను. అలాగే 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాను కూడా చేశాను. ఆ సినిమా విడుదల తరువాత, నా మేకప్ బాగోలేదంటూ విమర్శలు వచ్చాయి. మరోసారి నా పాత్రను చూసుకున్న తరువాత నాకు కూడా అదే అనిపించింది. అప్పటి నుంచి మేకప్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టాను. 'అర్జున్ సురవరం'లో నా లుక్ బాగుండటానికి కారణం, నేను తీసుకున్న జాగ్రత్తలే. ప్రస్తుతం తెలుగులో 'ఎ 1 ఎక్స్ ప్రెస్' చేస్తున్నాను. తమిళంలో రెండు సినిమాలను ఒప్పుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
Lavanya Tripathi
Actress
Unnadi Okate Zindagi Movie

More Telugu News