Yash: యశ్ హీరోగా భారీ మూవీ .. జోడీగా తమన్నా

kannada Movie
  • తమన్నాకి తగ్గిన అవకాశాలు
  •  కన్నడ నుంచి భారీ ఆఫర్
  •  దర్శకుడిగా నార్తన్
ఈ మధ్య కాలంలో తమన్నా కెరియర్ అంత ఆశాజనకంగా లేదు. ఒక పెద్ద సినిమాపడితే మళ్లీ తన కెరియర్ ఊపందుకుంటుందనే ఆశతో ఆమె వుంది. అలాంటి ఆఫర్ ఆమె తలుపు తట్టిందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ఏకంగా 'కేజీఎఫ్' హీరో సరసన ఆమెకి అవకాశం వచ్చిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

ప్రస్తుతం యశ్ .. 'కేజీఎఫ్ 2' చేస్తున్నాడు. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు. ఆ తరువాత నార్తన్ దర్శకత్వంలో యశ్ ఒక కన్నడ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. కథానాయికగా తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేస్తారట.
Yash
Tamannah
Kannada Movie

More Telugu News