Chandrababu: కోడెలపై 19 కేసులు పెట్టి.. వైసీపీ నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారు: చంద్రబాబు

chandrababu fires on ap govt
  • మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు
  • వైసీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ
  • ఈ రోజు కోడెల శివప్రసాద్ గారి జయంతి
  • ఆయన ప్రజాసేవలను మననం చేసుకుందాం
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. 'ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, ఆపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాద్ గారి సొంతం. ఈ లక్షణాలే రూపాయి డాక్టరుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న కోడెలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయి. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయి' అని చెప్పారు.
 
'అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైసీపీ నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారు. మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు. వైసీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ. ఈ రోజు కోడెల శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవలను మననం చేసుకుందాం' అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News