అజిత్ సినిమాలో విలన్ గా కార్తికేయ ఖాయమైనట్టే!

02-05-2020 Sat 09:03
  • యూత్ లో కార్తికేయపై మంచి క్రేజ్
  •  విలన్ పాత్రలకి మంచి మార్కులు
  • తాజా చిత్రంగా 'చావు కబురు చల్లగా'
Valimai Movie

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హీరో కార్తికేయ యూత్ కి బాగా చేరువయ్యాడు. ఆ తరువాత హీరోగా రొమాంటిక్ లవ్ స్టోరీస్  చేస్తూనే, విలన్ గా చేయడానికి కూడా ఆసక్తిని చూపుతున్నాడు. అలా 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలో ఆయన చేసిన విలన్ పాత్రకి మంచి పేరు వచ్చింది. హీరోగానే కాదు విలన్ రోల్స్ లోను కార్తికేయ రాణిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే అజిత్ సినిమాలో విలన్ పాత్రలో కార్తికేయ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. అజిత్ హీరోగా వినోత్ దర్శకత్వంలో 'వాలిమై' రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయను తీసుకోనున్నారనే టాక్ వినిపించింది. నిన్న అజిత్ పుట్టిన రోజున ఆయనకి కార్తికేయ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో, ఆయన 'వాలిమై' చేయడం ఖాయమైపోయిందనే టాక్ బలాన్ని పుంజుకుంది. ఇక తెలుగులో కార్తికేయ తాజాగా చిత్రంగా 'చావుకబురు చల్లగా' సెట్స్ పై వున్న సంగతి తెలిసిందే.