America: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న జో బిడెన్‌పై లైంగిక ఆరోపణల కలకలం!

  • తనను పలుమార్లు లైంగికంగా వేధించారంటూ తారా రీడే ఆరోపణలు
  • అలా ఎప్పుడూ జరగలేదన్న బిడెన్
  • డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి బిడెన్
US Presidential Candidate Joe Biden declares sexual assault

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌పై సెనేట్ మాజీ స్టాఫర్ తారా రీడే లైంగిక ఆరోపణలు చేశారు. 1990లలో బిడెన్ పలుమార్లు తనను లైంగికంగా వేధించారని రీడే ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఎన్నికలకు సిద్ధమవుతున్న బిడెన్‌కు ఇది కొంత ఎదురుదెబ్బేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను బిడెన్ కొట్టిపడేశారు. ఆమె ఆరోపణల్లో నిజం లేదని, తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు జరుగుతున్న కుట్రలో ఇది భాగమని పేర్కొన్నారు. ‘‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. అలా ఎప్పుడూ జరగలేదు’’ అని ఎంఎస్ఎన్‌బీసీకి చెందిన ‘మార్నింగ్ జో ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిడెన్ పేర్కొన్నారు.  

అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఆయన సమీప ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ కూడా బిడెన్‌కు మద్దతు ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రీడే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మరోమారు బరిలోకి దిగనున్నారు.

More Telugu News