Manchu Vishnu: ఫైట్ మాస్టర్లతో కలిసి ప్రత్యేక వీడియో రూపొందించిన మంచు విష్ణు

Manchu Vishnu makes an action video with fight masters
  • వెరైటీగా ఆలోచించిన మంచు విష్ణు
  • వీడియో ఆద్యంతం కిక్ ల మయం
  • ఇంట్లో గారెలు వేసిన మోహన్ బాబు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు లాక్ డౌన్ నేపథ్యంలో వినూత్నంగా ఆలోచించారు. ఫైట్ మాస్టర్లతో కలిసి ఓ యాక్షన్ వీడియో రూపొందించారు. ఎవరింట్లో వారు ఉంటూనే సీక్వెన్స్ ప్రకారం కిక్ లు ఇస్తూ వీడియోను రక్తి కట్టించారు. ఓ పవర్ పంచ్ తో మంచు విష్ణు షురూ చేయగా, ఒక్కో ఫైట్ మాస్టర్ ఒక్కో తరహాలో స్పందిస్తూ వినోదాన్ని పంచారు. ఈ యాక్షన్ స్కిట్ లో దక్షిణాది భాషలకు చెందిన ఫైట్ మాస్టర్లు పాల్గొన్నారు. అటు, మంచు విష్ణు తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు తన ఇంట్లో గారెలు వేశారు. తన మనవరాలితో కలిసి గారెలు చేసి మురిసిపోయారు.
Manchu Vishnu
Fight Masters
Action Video
Lockdown
Corona Virus
Mohan Babu

More Telugu News