Amazon: ఇతర దేశాలకంటే ఇండియాలోనే ఎక్కువ నష్టపోయాం: అమెజాన్

  • ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది
  • ఇండియాలో అత్యవసర వస్తువులను అమ్మేందుకే అనుమతి ఉంది
  • మా నష్టాలకు ఇదే కారణం
Amazon says India is where the biggest loss on its business

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ... ఇండియాలోనే తాము ఎక్కువగా నష్టపోయామని ప్రపంచ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓ బ్రయాన్ ఒల్సావ్స్కీ మాట్లాడుతూ, లాక్ డౌన్ నేపథ్యంలో ఇండియాలో కేవలం అత్యవసర సరుకులను మాత్రమే అమ్మడానికి పర్మిషన్ ఉందని... తమ నష్టాలకు ఇదే కారణమని చెప్పారు.

ఇండియాలో ఇది తమ ఒక్కరి సమస్య మాత్రమేకాదని... అన్ని సంస్థలపై ఇదే ప్రభావం ఉందని చెప్పారు. లాక్ డౌన్ పూర్తైన తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపారు.

కరోనా నేపథ్యంలో తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. తమ సిబ్బందికి టెంపరేచర్ చెక్ చేస్తున్నామని... ఓవర్ టైమ్ చేస్తున్న వారికి తాత్కాలికంగా వేతనాలను పెంచామని తెలిపారు. నిత్యావసరాల డెలివరీని 60 శాతం వరకు పెంచామని చెప్పారు.

More Telugu News