Chandrababu: మా హాట్ స్పాట్ నమూనాలను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది: చంద్రబాబు

Chandrababu responds after Niti Aayog vice chairman wrote him
  • విలువైన సూచనలు చేశారంటూ చంద్రబాబుకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ లేఖ
  • స్పందించిన చంద్రబాబు
  • కరోనాపై పోరాడుతున్న దేశానికి ఈ విధంగా సహకరిస్తున్నామని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొవిడ్-19 చర్యల్లో భాగంగా విలువైన సూచనలు అందజేశారంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లేఖ రాయడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ ప్రయత్నాలకు జీఎఫ్ఎస్ టీ కూడా తోడ్పాటు నందిస్తుండడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. కరోనా అదుపు చర్యల్లో భాగంగా తాము ప్రతిపాదించిన హాట్ స్పాట్ నమూనాలను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా ప్రశంసించారని వెల్లడించారు. ప్రపంచ అత్యుత్తమ మేధావులతో కలిసి పనిచేస్తున్నామని, కొవిడ్-19పై దేశం సాగిస్తున్న పోరాటానికి తాము ఈ విధంగా సహకారం అందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu
Niti Aayog
Vice Chairman
GFST
COVID-19
Corona Virus
India

More Telugu News