Niti Aayog: విలువైన సూచనలు చేశారంటూ.. చంద్రబాబుకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ లేఖ!

Niti Aayog vice chairman writes to TDP Chief Chandrababu Naidu
  • జీఎఫ్ఎస్ టీ తరఫున విలువైన సూచనలు అందించారంటూ కితాబు
  • సూచనలు ఎంతో విశ్లేషణాత్మకంగా ఉన్నాయని ప్రశంస
  • విలువైన మద్దతు అందించారంటూ ధన్యవాదాలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లేఖ రాశారు. ఏప్రిల్ 19న ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖపై రాజీవ్ కుమార్ స్పందించారు. జీఎఫ్ఎస్ టీ (గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫార్మేషన్) తరఫున విలువైన సూచనలతో నివేదిక అందించారని చంద్రబాబును ప్రశంసించారు.  మీ బృందం ఎంతో విశ్లేషణాత్మక రీతిలో సలహాలు అందించిందని కొనియాడారు. దేశంలో కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో రాష్ట్రాల నుంచి కీలక సూచనలతో కూడిన సమాచారాన్ని అందిపుచ్చుకోవడంలో కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని రాజీవ్ కుమార్ వివరించారు. మీరందించిన విలువైన మద్దతుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటూ పేర్కొన్నారు.
Niti Aayog
Vice Chairman
Chandrababu
GFST
COVID-19
Corona Virus

More Telugu News