Telangana: ఏపీ, మహారాష్ట్రలకు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం

TS Govt orders people not to go to AP and Maharashtra
  • ఏపీ, మహారాష్ట్రలలో పెరుగుతున్న కరోనా కేసులు
  • పనుల నిమిత్తం ఈ రాష్ట్రాలకు వెళ్లే సరిహద్దు జిల్లాల ప్రజలు
  • ప్రయాణాలపై నిషేధం విధించిన టీఎస్ ప్రభుత్వం
దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మరోవైపు, ఏపీలో కేసుల సంఖ్య కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, మహారాష్ట్రకు తెలంగాణ వాసులెవరూ వెళ్లొద్దని ఆదేశించింది. ఈ రాష్ట్రాలకు వెళ్లడంపై నిషేధం విధించింది.  

ఏపీ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వాసులకు ఆ రాష్ట్రాలతో బంధుత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సరిహద్దుల్లో ఉన్నవారు వైద్య, ఇతర అత్యవసర పనులకు కూడా ఈ రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఖమ్మం, నల్గొండ, జిల్లాల ప్రజలు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కర్నూలుకు వెళ్తుంటారు. దీంతో, వీరి ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసు బలగాలను పెంచింది.
Telangana
Andhra Pradesh
Maharashtra
Travel
Restrictions

More Telugu News