Budda Venkanna: హస్కీ వాయిస్ మిస్ అవుతున్నట్టున్నడు.. 'కాంబాబు' కష్టాలు అన్నీఇన్నీకావు: బుద్ధా సెటైర్లు

Kambabu is suffering a lot says Budda Venkanna
  • బాగా అలవాటైన గెస్ట్ హౌస్ క్వారంటైన్ లోకి వెళ్లలేకపోతున్నాడు
  • ఫ్రస్ట్రేషన్ లో నోరు పారేసుకుంటున్నాడు
  • గతంలో కూడా హస్కీ వాయిస్ తో పట్టుబడ్డాడు
'కాంబాబు' చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ డైరెక్ట్ గా పేరును ప్రస్తావించకుండా... ఓ వైసీపీ నేతపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ తో కాంబాబు కష్టాలు అన్నీఇన్నీ కావని అన్నారు.

హైదరాబాదులో బాగా అలవాటైన గెస్ట్ హౌస్ క్వారంటైన్ లోకి వెళ్లలేక హస్కీ వాయిస్ మిస్ అవుతున్నట్టు ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఫ్రస్ట్రేషన్ లో ఉండి నోరు పారేసుకుంటున్నారని అన్నారు. గతంలో కూడా ఇలాగే హస్కీ వాయిస్ తో పట్టుబడ్డాడని చెప్పారు. ఆయనకు ఇప్పుడు పదవి కూడా తోడయిందని, ఇంకెంతమందిని వేధిస్తాడోనని అన్నారు. హైదరాబాదులోని గెస్ట్ హౌస్ క్వారంటైన్ కు పంపకపోతే కాంబాబు ఏపీలోనే హస్కీవాయిస్ ప్రయోగిస్తాడని విమర్శించారు.
Budda Venkanna
Telugudesam
Ambati Rambabu
YSRCP
Husky Voice

More Telugu News