Sachin Tendulkar: నేను లక్ష్మణ్ పై అరిచానని మా అన్న నాపై కోప్పడ్డాడు: సచిన్

  • లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సచిన్
  • 1998 కోకాకోలా కప్ లో ఏంజరిగిందో వెల్లడి
  • రెండు మూడు సార్లు లక్ష్మణ్ పై కోప్పడినట్టు వివరణ
Sachin reveals past moments

కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ అమల్లో ఉండడంతో అందరితో పాటే క్రికెట్ లోకం కూడా ఇంటికే పరిమితమైంది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ఇంట్లోనే ఉంటూ ఓ టీవీ చానల్ కోసం తన గత అనుభవాలను పంచుకున్నారు. ఓ మ్యాచ్ లో తాను వీవీఎస్ లక్ష్మణ్ పై కోప్పడ్డానని, అందుకు ఆ మ్యాచ్ అయిపోయాక తన సోదరుడు మందలించాడని సచిన్ గుర్తు చేసుకున్నారు.

"1998లో షార్జాలో కోకాకోలా కప్ సందర్భంగా ఓ మ్యాచ్ లో నేను, లక్ష్మణ్ బ్యాటింగ్ చేస్తున్నాం. అయితే ఆ మ్యాచ్ లో లక్ష్మణ్ వేగంగా పరిగెట్టలేకపోతున్నట్టు అనిపించింది. ఎందుకు పరిగెట్టలేకపోతున్నావ్.... రెండు పరుగులు తీయాలని చెబుతున్నా అంటూ కోప్పడ్డాను. ఇదే విధంగా ఆ మ్యాచ్ లోనే రెండుమూడు సార్లు అరిచాను. అయితే ఆ టోర్నీ ముగిశాక ముంబయి వచ్చిన నాకు మా అన్నయ్య క్లాస్ తీసుకున్నాడు. లక్ష్మణ్ కూడా నీలాగే జట్టు కోసం ఆడుతున్నాడు. ఎంతైనా అతడు నీ టీమ్ మేట్. అయినా అది నీ ఒక్కడి మ్యాచ్ కాదు. మరోసారి మైదానంలో ఇలా ప్రవర్తించవద్దు అంటూ మా అన్నయ్య నాపై అరిచాడు" అంటూ నాటి అనుభవాలను సచిన్ వివరించాడు.

More Telugu News