అనకాపల్లి ఎంపీ వద్ద రేషన్ బియ్యం లారీ పట్టుబడింది... కేసు లేదా సీఎం గారూ?: వర్ల రామయ్య
- బస్తా బియ్యం దొరికితేనే కేసులు పెడతారంటూ ట్వీట్
- లారీ బియ్యం దొరికితే కేసు పెట్టరా? అంటూ ప్రశ్నించిన వర్ల
- మీ ఎంపీకి ఓ న్యాయం, పేదలకో న్యాయమా అంటూ ఆగ్రహం
అనకాపల్లి ఎంపీ, వైసీపీ మహిళా నేత డాక్టర్ సత్యవతి భర్త విష్ణుమూర్తి ఆధ్వర్యంలో నడిచే ఓ ట్రస్టు ఆవరణలో రేషన్ బియ్యం లారీ కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. పేదలకు పంచాల్సిన బియ్యం ప్రైవేటు వ్యక్తుల వద్ద కనిపించడం ప్రభుత్వ వర్గాలను ఆగ్రహానికి గురిచేసింది. దీనిపై లాక్ డౌన్ ముగిసిన తర్వాత విచారణ ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.