Chiranjeevi: ఈ రోజు దేశంలోని వలస కార్మికుల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం: చిరంజీవి

chiranjeevi about may day
  • వలస కార్మికుల ఇబ్బందులపై చిరు ట్వీట్
  • ప్రపంచ నిర్మాణం వారి వల్లే జరిగింది
  • వారు అసాధారణ పరిస్థితులను ఎదుర్కుంటున్నారు
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల గురించి అందరం ఆలోచిద్దామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.

'ఈ రోజు మేడే.. ప్రపంచ నిర్మాణం వారి వల్లే జరిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికుల గురించి ప్రపంచ కార్మిక దినోత్సవాన ఒక్కసారి ఆలోచిద్దాం. వారు అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు' అని చిరంజీవి అన్నారు.

కాగా, లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. వారిని సొంత ప్రాంతాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.  

Chiranjeevi
Tollywood
Lockdown

More Telugu News