Ramayan: దూరదర్శన్ లో 'రామాయణ్' మరో వరల్డ్ రికార్డు!

Ramayan Another World Record on DD
  • రీ టెలికాస్ట్ అయిన సీరియల్స్ లో అత్యధిక వ్యూయర్ షిప్
  • మార్చి 16 ఎపిసోడ్ ను వీక్షించిన 7.7 కోట్ల మంది
  • ట్విట్టర్ లో వెల్లడించిన ప్రసార భారతి
1980 దశకంలో ఆబాల గోపాలాన్నీ అలరించిన రామానంద సాగర్ 'రామాయణ్' ఇప్పుడు కూడా రికార్డుల వేటలో పరుగులు పెడుతోంది. తొలినాళ్లలో ప్రసారమైన పలు సీరియల్స్ ను దూరదర్శన్ తిరిగి ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. రామాయణ్ తో పాటు మహాభారత్, శక్తిమాన్, సర్కస్, శ్రీ కృష్ణ వంటి ఎన్నో సీరియల్స్ పునఃప్రసారం అయ్యాయి.

మార్చి 28 నుంచి రామాయణ్ రోజుకు రెండు భాగాల చొప్పున ప్రసారమైంది. ఇక ఏప్రిల్ 16న రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఎపిసోడ్ ను 7.7 కోట్ల మంది వీక్షించారని ప్రసార భారతి తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. రీ టెలికాస్ట్ ‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వ్యూస్ సాధించిన సీరియల్ ‌గా రామాయణ్‌ నిలిచిందని పేర్కొంది.
Ramayan
Prasara Bharathi
Re Telecast
World Record

More Telugu News