Corona Virus: తెలంగాణలో ప్రస్తుతమున్న రెడ్, ఆరంజ్ జోన్లు ఇవే!

  • రెడ్ జోన్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్ గిరి
  • వికారాబాద్, వరంగల్, సూర్యాపేట కూడా
  • 18కి పెరిగిన ఆరంజ్ జోన్ల సంఖ్య
  • 9 జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలో
Center Notifies Orange and Red Zones in Telangana

కరోనా కేసులు నమోదవుతున్న స్థాయిని బట్టి, రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ లుగా విభజించిన అధికారులు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి, లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్రం, రాష్ట్రంలోని రెజ్ జోన్లను, ఆరంజ్ జోన్ల వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో రెండు వారాల క్రితం గుర్తించిన 170 హాట్ స్పాట్స్ సంఖ్యను 129కి తగ్గించింది.

తెలంగాణలోని  రెడ్‌ జోన్ల విషయానికి వస్తే, హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికరాబాద్‌, వరంగల్‌ అర్బన్ జిల్లాలు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఆరంజ్ జోన్ల సంఖ్య 18కి పెరిగింది. వాటి వివరాలు పరిశీలిస్తే, నిజామాబాద్, జోగులాంబ, నిర్మల్‌, నల్గొండ, అదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసీఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, నారాయణపేట, మంచిర్యాల ప్రాంతాలున్నాయి. ఇదే సమయంలో మిగతా తొమ్మిది జిల్లాలైన పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌,  వనపర్తి, యాదాద్రి భువనగిరి గ్రీన్ జోన్లుగా కేంద్రం గుర్తించింది.

More Telugu News