ఆరుగురు కుటుంబీకులను హత్య చేసి... తాపీగా వెళ్లి పోలీసులకు లొంగిపోయిన లక్నో యువకుడు!
- ఆస్తి విషయంలో వివాదం
- తల్లిదండ్రులు సహా ఆరుగురి హత్య
- కేసును విచారిస్తున్న పోలీసులు
ఈ నేపథ్యంలో ఇంట్లోని వారితో గొడవ పడిన అజయ్ సింగ్, ఓ పదునైన ఆయుధంతో వారిపై దాడికి పాల్పడ్డాడు. తన తల్లిదండ్రులు అమర్ (60), రామ్ శక్తి (55), పెద్దన్న అరుణ్ (40), వదిన రామ్ దులారీ (35), వారి పిల్లలు సౌరభ్ (7), సారిక (2)లను హతమార్చాడు. ఆపై తానే ఈ హత్యలు చేశానంటూ పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయాడని లక్నో కమిషనర్ సుజీత్ పాండే వెల్లడించారు. ఈ విషయంలో కేసును రిజిస్టర్ చేశామని, విచారణ జరుపుతున్నామని తెలిపారు.