Imran Khan: పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ కు కరోనా... ప్రధాని ఇమ్రాన్ కు కరోనా పరీక్షలు!

Pakisthan National Assembly Speaker Asad Corona Positive
  • రెండు రోజుల క్రితం ఇమ్రాన్ ను కలిసిన అసద్
  • తాజా పరీక్షల్లో అసద్ కు పాజిటివ్
  • ఇమ్రాన్ కు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కరోనా భయం పట్టుకుంది. రెండు రోజుల క్రితం ఇమ్రాన్, జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖురేషీని కలిశారు. గురువారం అసద్ అస్వస్థతతో బాధపడుతూ ఉండగా, కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు, పాజిటివ్ గా తేల్చడంతో ఆందోళన మొదలైంది. అసద్ ను, ఆయన కుటుంబీకులందరినీ అధికారులు క్వారంటైన్ చేశారు. ఇటీవలి కాలంలో అసద్ ఎవరెవరిని కలిశారు? ఆయన దగ్గరకు ఎవరెవరు వచ్చారు? అన్న విషయాన్ని గుర్తించేందుకు అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇక ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల రిపోర్టు వెల్లడికావాల్సి వుంది. గతంలోనూ ఓ మారు ఇమ్రాన్ కు పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనకు వైరస్ నెగటివ్ వచ్చింది. తాజా సమాచారం మేరకు పాక్ లో 16,353 మంది కరోనా బాధితులు ఉన్నారు. లాక్ డౌన్ ను అమలు చేస్తూ, రంజాన్ మాసాన్ని ఇళ్లలోనే జరుపుకోవాలని, ప్రార్థనల పేరిట ఎవరూ బయటకు రావద్దని అధికారులు చెబుతున్నా, కేసుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన వారిలో నెలకొనివుంది.
Imran Khan
Asad
Pakistan
Assembly Speaker
Corona Virus
Positive

More Telugu News