Smoking: ధూమపాన ప్రియులకు ముప్పే.. తేల్చిన కరోనా అధ్యయనం!

  • దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
  • ఆర్ఎన్ఏ డేటా విశ్లేషణ
  • ఊపిరితిత్తుల కణజాలాల్లో వైరస్ సోకుతుందని తేలిన వైనం
Smoking can attract corona virus

ధూమపాన ప్రియుల్లో కరోనా ముప్పు ఎక్కువని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మిగతా వారితో పోలిస్తే వీరు తొందరగా కరోనా వైరస్ బారినపడతారని తేలింది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు పొగతాగిన వారి, తాగని వారి ఊపిరితిత్తుల కణజాలాల్లో ఉన్న రైబోన్యూక్లిక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ) డేటాను విశ్లేషించారు.

 ఈ సందర్భంగా  శ్వాస మార్గంలోని వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ఏసీఈ2, ఫ్యూరిన్‌, టీఎంపీఆర్‌ఎస్ ఎస్‌2  కణజాలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తేలిందేమిటంటే.. అసలు పొగతాగని వారితో పోలిస్తే తక్కువలో తక్కువగా 100 సిగరెట్లు తాగిన వారి ఊపిరితిత్తుల కణజాలలు వైరస్ బారినపడే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇది ధూమపాన ప్రియులకు హెచ్చరిక వంటిదేనని ఈ సందర్భంగా అధ్యయనకారులు తెలిపారు.

More Telugu News