Reliance: ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం

  • రిలయన్స్ పైనా కరోనా ప్రభావం
  • వేతనాల్లో 10 నుంచి 50 శాతం కోతలు
  • వార్షిక వేతనం రూ.15 లక్షలు మించినవారికే కోతల వర్తింపు
Reliance Industries cuts salaries of its employs

కరోనా సంక్షోభం ప్రభుత్వాలపైనే కాదు, పారిశ్రామిక సంస్థలు, వ్యాపార సామ్రాజ్యాలపైనా పెను ప్రభావం చూపుతోంది. కరోనా విపత్తు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థను సైతం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా నడిపించింది. ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ప్రకటించింది.

వేతనాల్లో 10 నుంచి 50 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపింది. వార్షిక వేతనం రూ.15 లక్షలు కన్నా తక్కువ ఉన్నవారికి కోతలు వర్తించవని సంస్థ పేర్కొంది. రూ.15 లక్షల కంటే ఎక్కువ వేతనాలు ఉంటే 10 శాతం కోత, బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు, సీనియర్ లీడర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం కోత అమలు చేయనున్నారు. ఇక, ఏడాదికి రూ.15 కోట్ల వరకు వేతనం అందుకునే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన వార్షిక వేతనాన్ని పూర్తిగా వదులుకునేందుకు సిద్ధమయ్యారు.

More Telugu News