Arogya Setu: కొత్తగా తయారయ్యే ఫోన్లలో ఇకపై తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్..?

Arogya Setu app will be pre installed as per Centre thought
  • ఆరోగ్య సేతు యాప్ తీసుకువచ్చిన కేంద్రం
  • కరోనా రోగుల సమీపంలోకి వెళ్లినప్పుడు అప్రమత్తం చేసే యాప్
  • ఫోన్ తయారీదశలోనే యాప్ ఇన్ స్టాల్ చేసేందుకు యత్నాలు!
కరోనాతో పోరాడుతున్న భారత్ లో ఆరోగ్య సేతు యాప్ ఎంతో పాప్యులారిటీ అందుకుంటోంది. కరోనా వైరస్ ఉన్న వ్యక్తికి సమీపంగా వెళ్లినప్పుడు ఈ యాప్ అప్రమత్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ లక్షల్లో డౌన్ లోడ్ అవుతోంది. 11 భాషల్లో ఈ యాప్ సేవలు అందుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ విధిగా తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలని, ఆ యాప్ లో సేఫ్ అని సూచించిన తర్వాతే ఆఫీసులకు రావాలని కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది.

అయితే తాజాగా ఈ యాప్ ను కొత్తగా తయారయ్యే ఫోన్లలో ముందే నిక్షిప్తం చేయాలని కేంద్రం భావిస్తోంది. కొత్త ఫోన్లతో పాటు వచ్చే యాప్ లలో ప్రీ ఇన్ స్టాల్ గా ఈ యాప్ కూడా ఉండాలన్నది కేంద్రం యోచన. ఈ మేరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలను కూడా కోరినట్టు తెలుస్తోంది. కొత్త ఫోన్ వాడకం ప్రారంభించే సమయంలోనే ఆరోగ్య సేతు యాప్ లో యూజర్లు తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేయనున్నట్టు సమాచారం.
Arogya Setu
App
Pre Installed
Centre
Corona Virus
COVID-19

More Telugu News