Manmohan Mall: అమెరికాలో భారతీయ దంపతుల విషాదాంతం... ఫ్లాట్ లో భార్య శవం, నది వద్ద భర్త మృతదేహం!

Indian man and his wife found dead in Jersey city
  • ఫ్లాట్ లో విగతజీవిగా పడివున్న భార్య
  • భార్య శరీరంపై గాయాలు
  • నది వద్ద భర్త శవం
  • జెర్సీ సిటీలో ఘటన
కరోనాతో కల్లోలభరితంగా ఉన్న అమెరికాలో భారతీయ దంపతులు విగతజీవుల్లా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. జెర్సీ సిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 26న గరిమా కొఠారీ అనే యువతి తన ఫ్లాట్ లో విగతజీవిగా పడివుండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె భర్త మన్మోహన్ మల్ (37) జెర్సీ సిటీలో ఉన్న హడ్సన్ నదిలో శవమై కనిపించాడు. గరిమా కొఠారీ దేహంపై అనేక గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టంలో తేలడంతో ఆమెది హత్యగా నిర్ధారణ అయింది.  అంతేకాదు, ఆమె ఐదు నెలల గర్భవతి అని కూడా వైద్య నిపుణులు తెలిపారు.

ఓ వ్యక్తి హడ్సన్ నదిలో ఆత్మహత్యకు యత్నించాడన్న సమాచారంతో పోలీసులు గాలింపు జరపగా, మన్మోహన్ మల్ మృతదేహం లభించింది. మన్మోహన్ మల్ మరణం ఆత్మహత్య కారణంగానే సంభవించిందా? అనే విషయం అధికారికంగా నిర్ధారణ కాలేదు. అయితే, ప్రాథమిక అంచనాల ప్రకారం.... భార్యను హత్య చేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, గరిమా ఫేమస్ చెఫ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మన్మోహన్ భారత్ లో ఐఐటీలో విద్యాభ్యాసం చేసిన నిపుణుడు. వీరికి జెర్సీ సిటీలో 'నుక్కడ్' అనే భారతీయ రెస్టారెంట్ కూడా ఉంది. 'నుక్కడ్' లో పనిచేసే ఉద్యోగులు మాత్రం వారిది అన్యోన్య దాంపత్యం అని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు సైతం ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయడంలేదు. దాంతో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని వుంటే కనుక, అందుకు కారణం ఏమిటన్నది విచారణలో తేలాల్సి వుంది.
Manmohan Mall
Garima
USA
Jersey City
Dead

More Telugu News