Sayyad Akbaruddin: యూఎన్ఓ లో భారత శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ పదవీ విరమణ

  • యూఎన్ఓ ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన అక్బరుద్దీన్
  • ‘నమస్తే’ చెబుతూ పదవీ విరమణ చేసిన అక్బరుద్దీన్
  • ప్రతి నమస్కారం చేసిన ఆంటోనియా గుటెరస్  
 Indian Permanent Representative in UNO Akbaruddin Retired

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఇవాళ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ తో ఆయన మాట్లాడారు. మన దేశ సంప్రదాయ పద్ధతిలో ఆయనకు నమస్కరించిన అక్బరుద్దీన్ పదవీ విరమణ పొందారు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్బరుద్దీన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

భారతదేశ సంప్రదాయం ప్రకారం ఎవరినైనా కలిసినప్పుడు లేదా తిరిగి వెళ్లేటప్పుడు అవతలి వారికి ‘షేక్  హ్యాండ్’ ఇవ్వడం వంటివి కాకుండా ‘నమస్తే’ అని చెబుతారని, ఇప్పుడు తాను కూడా అలాగే చెప్పాలని అనుకుంటున్నానంటూ గుటెరస్ కు ‘నమస్తే’ చెప్పగా, ఇందుకు గుటెరస్ స్పందిస్తూ ఆయన కూడా తిరిగి ‘నమస్తే’ చెప్పడం ఆ వీడియోలో కనబడుతుంది.

కాగా, 1985 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్’ అధికారి సయ్యద్ అక్బరుద్దీన్. 2016 జనవరి లో యూఎన్ ఓలో భారత శాశ్వత ప్రతినిధి అయ్యారు. అక్బరుద్దీన్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో టీఎస్ తిరుమూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీగా ఆయన కొనసాగుతున్నారు.

More Telugu News