Kanna Lakshminarayana: వేలి ముద్రలతో జనాలు భయపడుతున్నారు: జగన్ కు కన్నా లేఖ

  • ఏపీలో ప్రారంభమైన రేషన్ సరఫరా
  • వేలి ముద్రలు తప్పనిసరి చేసిన ప్రభుత్వం
  • కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కన్నా ఆందోళన
Kanna Lakshminarayana writes letter to Jagan

రేషన్ పంపిణీని ఏపీ పౌరసరఫరాల శాఖ నిన్నటి నుంచి ప్రారంభించింది. మే 10వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేయనున్నారు. సరుకులు తీసుకునే కార్డుదారులకు వేలిముద్రలు తప్పనిసరి చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు.

రేషన్ పంపిణీ సమయంలో లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో... ఈ విధానం వల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ విధానాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News