Rishi Kapoor: 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎవర్ గ్రీన్ హీరో రిషి కపూర్ కు వచ్చిన ఫిలింఫేర్, ఇతర అవార్దులు ఇవే!

  • తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు
  • ఎన్నో అవార్డులను సొంత చేసుకున్న రిషి
  • రిషిని సన్మానించిన రష్యా ప్రభుత్వం
Rishi Kapoor awards

ఈ ఉదయం 8.45 గంటలకు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటుడు రిషి కపూర్ తుదిశ్వాస విడిచారు. రెండేళ్లపాటు ల్యుకేమియాతో ఆయన పోరాడారు. న్యూయార్క్ లో గత ఏడాది చికిత్స పొందారు. చికిత్స కోసం దాదాపు ఏడాది పాటు ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయన మరణంతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన పలు అవార్డులను సొంత చేసుకున్నారు. వాటి వివరాలు చూద్దాం.

1970 - 'మేరా నామ్ జోకర్'కు స్పెషల్ అవార్డ్, బాల నటుడిగా జాతీయ ఫిల్మ్ అవార్డ్
1974 - 'బాబీ' చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్
2008 - ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్
2009 - రష్యా ప్రభుత్వం చేత గౌరవ సన్మానం
2010 - 'లవ్ ఆజ్ కల్' చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ (అప్సర ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డ్)
2011 - భార్య నీతూ సింగ్ తో కలిసి 'లైఫ్ టైమ్ జోడి'  జీ సినీ అవార్డ్
2013 - టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డ్
2016 - 'స్క్రీన్' లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్
2017 - 'స్క్రీన్' అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (కపూర్ అండ్ సన్స్ చిత్రం)
2017 - 'కపూర్ అండ్ సన్స్' చిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్
2017 - బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్ (జీ సినీ అవార్డ్ - కపూర్ అండ్ సన్స్ చిత్రం)
2017 - జీ సినీ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ రోల్ (కపూర్ అండ్ సన్స్ చిత్రం).

More Telugu News