Nagarjuna: ఆ వార్తల్లో నిజం లేదు .. నాపై నాగార్జునగారికి కోపం లేదు: దర్శకుడు పరశురామ్

Parshuram Movie
  • 'నాగేశ్వరరావు' ప్రాజెక్టు ఆగిపోలేదు
  •  చైతూ కెరియర్లో బెస్ట్ మూవీ అవుతుంది
  • మహేశ్ మూవీ తరువాత పట్టాలెక్కుతుందన్న పరశురామ్
ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో పరశురామ్ తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు. ఆయన తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయడానికి సిద్ధమవుతున్నాడు. వాస్తవానికి ఈ సినిమాకంటే ముందుగా ఆయన నాగచైతన్యతో 'నాగేశ్వర రావు' సినిమా చేయవలసి వుంది. ఈ లోగా మహేశ్ బాబు నుంచి పిలుపు రావడంతో, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి ఆయన ఇటువైపు వచ్చేశాడు.

పరశురామ్ ఈ విధంగా చేయడం పట్ల నాగార్జున కోపంగా ఉన్నారనీ, ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్టేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ ప్రచారంపై తాజాగా పరశురామ్ స్పందిస్తూ .. " చైతూతో నేను చేయవలసిన సినిమా ఆగిపోలేదు. మహేశ్ బాబుతో సినిమా పూర్తయిన తరువాత, 'నాగేశ్వరరావు' పట్టాలెక్కుతుంది. చైతూ కెరియర్లో ఇది  చెప్పుకోదగిన సినిమా అవుతుంది. అక్కినేని ఫ్యామిలీతో నాకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. నాపై నాగార్జునగారికి కోపం వచ్చిందనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు" అని చెప్పుకొచ్చాడు.
Nagarjuna
Naga chaitanya
Parashu Ram

More Telugu News